సీసీ రోడ్ల నిర్మాణానికి శ్రీకారం
BPT: వేటపాలెం(మం) కటారివారిపాలెం గ్రామంలో రూ.22 లక్షల వ్యయంతో 430 మీటర్ల పొడవు గల సీసీ రోడ్ల నిర్మాణ పనులను టీడీపీ అధికార ప్రతినిధి మహేంద్ర నాథ్ మంగళవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం గ్రామాలలో మౌలిక వసతులను కల్పించేందకు పెద్దపీట వేస్తుందని చెప్పుకొచ్చారు. నిర్మాణ పనులు నాణ్యతతో పటిష్టంగా చేపట్టాలని గుత్తేదారులకు సూచించారు.