డ్రైనేజి మయంగా చిలుకానగర్ రోడ్లు..!
MDCL: ఉప్పల్ పరిధిలోని చిలుకానగర్ ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహం వద్ద డ్రైనేజి నీరు రోడ్లపైకి పొంగిపొర్లుతూ తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. కాలనీలలోని డ్రైనేజి లైన్లు సరిగా పనిచేయకపోవడంతో మురుగు నీరు రోడ్లపై చేరి దుర్వాసన వ్యాపిస్తోంది. దీంతో స్థానికులు, వాహనదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలన్నారు.