బాల కుమారస్వామి ఆలయంపై పడ్డ చెట్టు
MLG: తాడ్వాయి మండలం లింగాల పంచాయతీ కొడిశాలలో గాలివానకు ఇప్పచెట్టు కొమ్మ విరిగి బాల కుమారస్వామి ఆలయంపై పడగా ఆలయం కూలిపోయింది. సర్పంచ్ మొగిలిపల్లి రవీందర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. గ్రామ పెద్దలు నష్టం వివరాలు అంచనా వేశారు. పునర్నిర్మాణంపై చర్చలు కొనసాగుతున్నాయి.