నేడు నెల్లూరులో ఆరు చోట్ల వైద్య శిబిరాలు

నెల్లూరు: నగరంలోని ఆరు పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో బుధవారం ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాలు నిర్వహించనున్నారు. టైలర్స్ కాలనీ, వెంగమాంబ వీధి, అల్లీపురం, చంద్రమౌళినగర్, రాజావీధి, కపాడిపాళెం ఆరోగ్య కేంద్రాల్లో ఉదయం 9 గంటల నుంచి వైద్య శిబిరాలు ప్రారంభమవుతాయి. ఆయా ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులతో పాటు స్పెషలిస్టు డాక్టర్లు ప్రజలకు సేవలు అందించనున్నారు.