108 అంబులెన్స్ పరికరాల తనిఖీ
JGL: రాయికల్ పట్టణంలో 108 అంబులెన్స్‌లోని పరికరాల పనితీరును జిల్లా మేనేజర్ ఐలయ్య సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అంబులెన్స్‌లోని వెంటిలేటర్, మల్టీ ఛానల్ మానిటర్, ఆక్సిజన్, పలు రకాల మందులను పరిశీలించారు. అత్యవసర పరిస్థితుల్లో అందుబాటులో ఉండి మరింత మెరుగైన సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. అనంతరం 102 వాహనాన్ని కూడా తనిఖీ చేశారు.