VIDEO: షాపులు తొలగించి తమ పొట్ట కొట్టారంటూ వ్యాపారుల రాస్తారోకో
MNCL: బెల్లంపల్లి పట్టణ అభివృద్ధిలో భాగంగా చేస్తున్న రోడ్డు విస్తరణ పనులలో తమ షాపులు తొలగించి తమ పొట్ట కొట్టారంటూ పలువురు వ్యాపారస్తులు శనివారం రాస్తారోకో నిర్వహించారు. తమ పట్టణ అభివృద్ధికి వ్యతిరేకం కాదని, కానీ ఒక్కసారిగా తమ జీవనోపాధి తొలగిస్తే తాము ఎక్కడికి వెళ్లాలి, ఎలా బతకాలి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. షాపులు తొలగిస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు.