'ట్రాక్టర్ ర్యాలీ విజయవంతం చేయండి'

NLR: సూపర్ సిక్స్ మేనిఫెస్టోలోని భాగమైన 'అన్నదాత సుఖీభవ' అమలులో భాగంగా ఉదయగిరి MLA కాకర్ల సురేష్ నేతృత్వంలో బుధవారం భారీ ట్రాక్టర్ ర్యాలీ జరగనున్నట్లు బీజేపీ కిసాన్ మెర్చా జిల్లా మాజీ ఉపాధ్యక్షులు మేకపాటి మాల్యాద్రి నాయుడు తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ.. దుత్తలూరు నుంచి ఉదయగిరి మార్కెట్ యార్డ్ వరకు జరిగే ర్యాలీలో నియోజకవర్గంలోని అన్ని వర్గాల వారు పాల్గొనాలని కోరారు.