మా దళాలకు ఉచ్చు ఏమోనని టెన్షన్ పడ్డాం: ట్రంప్
ఎఫ్-15 పైలట్‌ను రక్షించే ఆపరేషన్‌పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి స్పందించారు. ఆ పైలట్ ఇరాన్ నుంచి 'భగవంతుడిదే శక్తి' అనే సందేశం పంపినట్లు వెల్లడించారు. ఆ రేడియో సంకేతాలు తమ దళాలకు ఉచ్చు ఏమోనని టెన్షన్ పడినట్లు తెలిపారు. అతడు ఇరాన్ కస్టడీలో ఉన్నట్లు అనుమానించామని చెప్పారు. ఆ తర్వాత అమెరికా దళాలు టెక్నాలజీలను వాడి పైలట్‌ను గుర్తించి కాపాడారని అన్నారు.