VIDEO: తమ్ముడిని గొడ్డలితో నరికిన అన్న
KNR: కరీంనగర్‌లోని కిసాన్ నగర్‌లో నివసిస్తున్న తుంగ రాజు (35) తన సొంత తమ్ముడు తుంగ రంజిత్ కుమార్ (30)ను గొడ్డలితో నరికి, కత్తితో గొంతుకోసి, ఇంటిని తన పేరు మీద రాయాలని బెదిరించినట్లు సమాచారం. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన రంజిత్ కుమార్‌ను చుట్టుపక్కల వారు రక్షించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రాజును అరెస్టు చేసి పోలీస్టేషన్‌కు తరలించి, విచారణ చేపట్టారు.