VIDEO: 'అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి'

ప్రకాశం: కనిగిరి ICDS కార్యాలయం వద్ద సోమవారం సాయంత్రం అంగన్వాడీ కార్యకర్తలు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నిరసన తెలియజేశారు. ప్రభుత్వం అందజేసిన సెల్ ఫోన్లను కార్యాలయంలో తిరిగి ఇవ్వటం జరిగింది. కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని, మినీ అంగన్వాడీలను మెయిన్ అంగన్వాడీలుగా మార్చాలని CITU జిల్లా నాయకులు PC కేశవరావు కోరారు.