శ్రీశైల నిత్యాన్నదాన పథకానికి రూ.1,00,116 విరాళం

శ్రీశైల నిత్యాన్నదాన పథకానికి రూ.1,00,116 విరాళం

KNL: శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి ఏలూరుకి చెందిన వెంకట నాగేశ్వరమ్మ అనే భక్తురాలు రూ.1,00,116 విరాళం అందజేశారు. ఈ మేరకు సంబంధిత విరాళ సొమ్మును సోమవారం దేవస్థానం డొనేషన్ కౌంటర్ నందు ఆలయ అధికారులకు అప్పగించారు. ఈ సందర్భంగా దాతలకు ఆలయ మర్యాదలతో స్వామి అమ్మవార్ల దర్శనం చేయించి తీర్థ ప్రసాదాలను అందజేశారు.