సీఎం సమావేశంలో పాల్గొన్న కలెక్టర్

NDL: ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్లతో సమావేశం సోమవారం జరిగింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల కలెక్టర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. నంద్యాల జిల్లాను మరింత అభివృద్ధి చేసేందుకు కలెక్టర్ రాజకుమారి గణియా పలు సూచనలు చేశారు. అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలు, చేపట్టాల్సిన ప్రణాళికలపై సీఎంతో చర్చించారు.