సింగర్ మృతిపై సీఎం సంచలన వ్యాఖ్యలు
అసోం సింగర్ జుబిన్ గార్గ్ మృతిపై ఆ రాష్ట్ర సీఎం హిమంత బిశ్వ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. జుబీన్ గార్గ్ ప్రమాదవశాత్తూ చనిపోలేదని.. అతడిని సింగపూర్‌లో హత్య చేశారని ఆరోపించారు. ఈ కేసుపై డిసెంబర్ 8 నాటికి ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామని తెలిపారు. అయితే ఈ ఘటన విదేశాల్లో జరిగినందున ఛార్జ్ షీట్ దాఖలు చేయటానికి కేంద్ర హోంశాఖ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు.