స్వచ్ఛ రథం ప్రారంభించిన ఎమ్మెల్యే బుద్ధప్రసాద్
కృష్ణా: స్వచ్ఛ రథం సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ కోరారు. మంగళవారం కోడూరు ఎంపీడీవో కార్యాలయం వద్ధ స్వచ్ఛ రథాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణకు అనువుగా, ప్లాస్టిక్ వ్యర్థాలు, పేపర్ వ్యర్థాలు స్వచ్ఛ రథానికి ఇచ్చి నిత్యావసర సరుకులు తీసుకోవాలని సూచించారు. నియోజకవర్గ ప్రత్యేక అధికారి పెనుమూడి సాయిబాబు పాల్గొన్నారు.