ట్రాక్టర్ నడిపిన టీడీపీ ఇంఛార్జ్ గొట్టిపాటి

ప్రకాశం: దర్శిలో టీడీపీ ఇంఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి ఆధ్వర్యంలో శనివారం రైతు విజయోత్సవ ర్యాలీ జరిగింది. ముండ్లమూరు మండలం పులిపాడు నుంచి దర్శి ఏఎంసీ మార్కెట్ వరకు ట్రాక్టర్ ర్యాలీ సాగింది. ర్యాలీలో రైతులతో కలిసి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, లలిత్ సాగర్‌లు ట్రాక్టర్ నడిపారు. ఈ ర్యాలీలో రైతు మిషన్ వైస్ ఛైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.