ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పీజీ సీట్లకు స్పాట్ అడ్మిషన్లు
AKP: నర్సీపట్నం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులలో స్పాట్ అడ్మిషన్లు కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ప్రిన్సిపాల్ డాక్టర్ రాజు తెలిపారు. ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ 9 సీట్లు, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ కోర్సులో 13 సీట్లు, ఎం కామ్ లో 35 సీట్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. కార్యాలయంలో సంప్రదించాలన్నారు.