VIDEO: రవాణా శాఖ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు
NRML: జిల్లా రవాణా శాఖకార్యాలయంలో ఏసీబీ అధికారులు బుధవారం తనిఖీలు నిర్వహించారు. ఆదిలాబాద్ ఏసీబీ డీఎస్పీ మధు కార్యాలయంలో తనిఖీలు నిర్వహించి రికార్డులను పరిశీలించారు. సాధారణ తనిఖీల్లో భాగంగానే ఈ తనిఖీలు నిర్వహించినట్లు ఆయన వెల్లడించారు. తనిఖీలలో ఎంవీఐ, డీటీవో సెలవుల్లో ఉన్నారని తెలిపారు. రికార్డులు సక్రమంగానే నిర్వహిస్తున్నారన్నారు.