కేంద్ర పథకాలను ఇంటింటికీ చేర్చాలి: BJP
GDWL: బీజేపీ పార్టీ సిద్ధాంతాలను, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలి అని బీజేపీ రాష్ట్ర నాయకురాలు స్నిగ్ధా రెడ్డి పేర్కొన్నారు. శనివారం గద్వాల మండలంలోని జమ్మిచేడు సమీపంలో నిర్వహించిన రెండు రోజుల పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రశిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. పార్టీ క్రమశిక్షణ, వ్యవస్థాపక విలువలపై కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.