VIDEO: అరకోటి దాటిన వాడపల్లి వెంకన్న ఆదాయం
కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయానికి శనివారం ఉదయం నుంచి రాత్రి ఆలయం మూసి వేసే వరకూ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో రద్దీ నెలకొంది. అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం భక్తులు అన్న ప్రసాదంలో పాల్గొన్నారు. వివిధ సేవలు, విరాళాలు ద్వారా రూ. 56.21 లక్షల ఆదాయం వచ్చినట్లు ఈవో చక్రధర్ రావు తెలిపారు.