'గ్రామాల్లో శుభ్రత లేకపోతే కఠిన చర్యలు'
ASR: రంపచోడవరం పరిధిలోని దోనెలపాలెం గ్రామంలో దోమల నియంత్రణపై అధికారులు కఠిన హెచ్చరికలు జారీ చేశారు. మలేరియా అధికారి డా. రామిరెడ్డి నిన్న పిచికారి పనులను పరిశీలిస్తూ ఇళ్ల చుట్టూ నిల్వ నీరు, చెత్త పేరుకుపోతే దోమల పెరుగుదల పెరిగి మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధులు విస్తరిస్తాయన్నారు. వెంటనే శుభ్రత పాటించకపోతే కఠిన చర్యలు ఉంటాయన్నారు.