మోడల్ స్కూల్లో మధ్యాహ్న భోజనం తనిఖీ

మోడల్ స్కూల్లో మధ్యాహ్న భోజనం తనిఖీ

PDPL: మోడల్ స్కూల్ వంటలను మెరుగుపరచాలని ఎంపీడీవో సురేశ్, కార్యదర్శి సంధ్యారాణి తెలిపారు. ముత్తారం మండలం దర్యాపూర్ మోడల్ స్కూల్లో సోమవారం మధ్యాహ్న భోజనాన్ని సర్పంచ్ రాపెల్లి రాజయ్య, ఎంపీడీవో, కార్య దర్శి పరిశీలించారు. ఆహార నాణ్యత విషయంలో రాజీ పడకూడదని వారు నిర్వాహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.