'కేంద్ర పథకాలు సద్వినియోగం చేసుకోండి'

'కేంద్ర పథకాలు సద్వినియోగం చేసుకోండి'

GDWL: కేంద్ర ప్రభుత్వం 50 శాతం సబ్సిడీపై అందిస్తున్న పప్పు శనగలు, రాగులు, జొన్నల విత్తనాలను వడ్డేపల్లి మండలం శాంతినగర్ అగ్రికల్చర్ ఆఫీసులో సోమవారం రైతులకు ఏఈవో రవీందర్ రావు, జిల్లా బీజేపీ అధ్యక్షులు రామాంజనేయులు అందించారు. ​రైతులు కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని రామాంజనేయులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, బీజేపీ నేతలు పాల్గొన్నారు.