డబ్బుల కోసం కూతురిని అమ్మిన తల్లి
డబ్బు కోసం కన్న కూతురినే ఓ తల్లి అమ్మేసిన ఘటన యూపీలో వెలుగు చూసింది. డబ్బుల కోసం తనను కుటుంబసభ్యులే వ్యభిచారంలో దింపుతున్నారని, దాన్ని ప్రతిఘటించడంతో తీవ్రంగా కొట్టారని బాధితురాలు తెలిపింది. తన తల్లితో పాటు ఇద్దరు అక్కలు కూడా వేధిస్తున్నారని.. రూ.10 లక్షలకు అమ్మేశారని వాపోయింది. వారి నుంచి తప్పించుకున్న యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన బయటపడింది.