హిమాచల్ రోడ్లపై వాహనాల రద్దీ
ఢిల్లీలో కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. AQI సూచికలు అధ్వాన స్థాయిలో నమోదు అవుతున్నాయి. దీని కారణంగా నగర వాసులు తాత్కాలికంగా ఇతర ప్రాంతాలకు, ముఖ్యంగా హిల్ స్టేట్లకు వెళ్లడం మొదలుపెట్టారు. దీంతో హిమాచల్ ప్రదేశ్‌లోని రోహాంగ్ పాస్ దగ్గర వాహనాలు భారీగా క్యూ కట్టాయి. ఈ క్రమంలో వందలాది కార్లు రోప్తాంగ్ రహదారిపై నిలిచిపోయాయి.