మే 1 నుంచి వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు

మే 1 నుంచి వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు

AKP: జిల్లాలో మే ఒకటవ తేదీ నుంచి వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారిణి పి. శైలజ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. 8-14 ఏళ్ల వయసు గల పిల్లలకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ శిబిరాలను నిర్వహించేందుకు క్రీడా అసోసియేషన్స్, స్వచ్ఛంద సంస్థలు, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఈనెల 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.