కలెక్టర్ సీరియస్: ఆరుగురికి షోకాజ్ నోటీసులు..!
MNCL: మందమర్రి తహసీల్దార్ కార్యాలయంలో విధులకు హాజరు కాని ఆరుగురికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. మంగళవారం కార్యాలయాన్ని సందర్శించి అధికారులు, సిబ్బంది హాజరు పట్టిక, రిజిస్టర్లు, రికార్డులు పరిశీలించారు. విధులలో సమయపాలన పాటించాలని పేర్కొన్నారు. వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలకు జవాబుదారీతనంగా వ్యవహరించాలని తెలిపారు.