VIDEO: కలెక్టర్ ఎదుట ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం నిరసన
హన్మకొండ నగరంలో కలెక్టరేట్ ఎదుట గురువారం ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యం శాంతియుత నిరసన చేపట్టింది. వారు విద్యార్థి సంఘాలు ప్రైవేట్ విద్యాసంస్థలపై భౌతిక దాడులు చేస్తున్నాయని, ప్రిన్సిపలపై చేయి వేసుకోవటం సరికాదని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాల నుంచి ప్రైవేట్ కళాశాల యాజమాన్యాన్ని కాపాడాలని నినాదాలు చేపట్టారు.