పదవి విరమణలో పాల్గొన్న రాష్ట్ర విద్యా కమిషన్ మెంబర్

MBNR: మిడ్జిల్ మండల కేంద్రం MVS ఫంక్షన్ హాల్‌లో శనివారం జరిగిన ఉపాధ్యాయ పదవీ విరమణ మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ మెంబర్ చారకొండ వెంకటేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విధుల పట్ల అంకితభావంతో పనిచేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాస్, సీతారాం తదితరులు పాల్గొన్నారు.