మణికేశ్వరంలో 'రైతన్న.. మీకోసం' కార్యక్రమం
BPT: అద్దంకి మండలం మణికేశ్వరం గ్రామంలో శుక్రవారం 'రైతన్న.. మీకోసం' కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి వెంకటకృష్ణ పాల్గొని నేరుగా రైతుల ఇళ్ల వద్దకు వెళ్లి పంచ సూత్రాల కరపత్రికను రైతులకు అందజేశారు. వ్యవసాయంలో నూతన పద్ధతులు, సేంద్రీయ వ్యవసాయం తదితర వివరాల గురించి ఆయన రైతులకు తెలియజేశారు.