'బాహుబలి: ది ఎపిక్'.. రివ్యూ ఇచ్చిన ప్రశాంత్ నీల్
'బాహుబలి: ది ఎపిక్' సినిమాపై దర్శకుడు ప్రశాంత్ నీల్ రివ్యూ ఇచ్చాడు. 'ఒక రోడ్డుకు మరమ్మతు చేయాల్సి వచ్చింది. దీంతో అందరూ కలిసి ఓ కాంట్రాక్టర్‌ను పిలిచారు. అతడు ఆ రోడ్డుకు మరమ్మతులు చేయడంతో పాటు దాన్ని ఏకంగా 16 వరుసల హైవేగా మార్చేశాడు. ఆ రోడ్డు ఏదో కాదు.. పాన్ ఇండియా, ఆ కాంట్రాక్టర్ రాజమౌళినే' అంటూ రాజమౌళిని ప్రశాంత్ నీల్ అభినందించాడు.