ఆదోని జిల్లా సాధన కోసం రిలే నిరాహార దీక్ష..!
KRNL: ఆదోని జిల్లా సాధన కోసం ఇవాళ 127వ రోజు రిలే నిరాహార దీక్ష కొనసాగుతుంది. జేఏసీ నేత పగడాల కోదండ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. దీక్షకు వివిధ పార్టీల నాయకులు సంఘీభావం తెలుపుతూ.. ఆదోని జిల్లాకు మద్దతు ప్రకటించారు. ప్రజల నీరు, వైద్యం, విద్య, ఉపాధి సమస్యల పరిష్కారానికి ఆదోని జిల్లా అవసరమని జేఏసీ నాయకులు పేర్కొన్నారు.