పోషకాహార లోపంతో రుగ్మతలు: కలెక్టర్
కోనసీమ: పోషకాహార లోపం వల్ల చిన్నారుల్లో అనేక రుగ్మతలు వస్తాయని జిల్లా కలెక్టర్ మహేష్‌కుమార్ అన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో నమోదైన బాలింతలు, గర్భిణులు, చిన్నారులు, కిశోర బాలికలకు పోషకాహారంపై అవగాహన కల్పించడమే ధ్యేయంగా పోషణ్ పక్వాడ మాసోత్సవాలను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన అవగాహన కార్యక్రమాలు ఈ నెల 9నుంచి 23వరకు జిల్లాలో నిర్వహిస్తామని పేర్కొన్నారు.