మేడ్చల్‌లో వరి పంట వైపే మొగ్గు చూపిన రైతన్నలు
MDCL: జిల్లాలో యాసంగి సీజన్‌లో కూడా రైతన్నలు వరి పంట వైపే ఎక్కువగా మొగ్గు చూపారు. వర్షాకాలంతో పోల్చితే ఈసారి వరి సాగు విస్తీర్ణం సుమారు 8 శాతం మేర పెరిగినట్లు TCM తెలిపారు. నీటి లభ్యత, మార్కెట్‌లో స్థిరమైన ధరల ఆశతో రైతులు వరి సాగును ప్రాధాన్యతగా ఎంచుకుంటున్నారు. అయితే, అధిక వరి సాగుతో నీటి వినియోగంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.