రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన.. కల్వల విద్యార్థులు
MHBD: కేసముద్రం మండలం కల్వల గ్రామ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు నితీశ్, అనిత రాష్ట్రస్థాయి నెట్‌బాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 9న నెల్లికుదురులో జరిగిన ఉమ్మడి జిల్లా అండర్-17 నెట్‌బాల్ పోటీల్లో అత్యుత్తమ ప్రదర్శనతో రాష్ట్ర జట్టులో చోటు సాధించారు. నవంబరు 21-23 మధ్య నల్గొండలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పాఠశాల HM నరేందర్ ఇవాళ తెలిపారు.