లేపాక్షి ఆలయం శిల్ప సంపదకు నిలయం

లేపాక్షి ఆలయం శిల్ప సంపదకు నిలయం

సత్యసాయి: వీరభద్రస్వామి కొలువైన లేపాక్షి ఆలయం అద్భుతమైన శిల్ప సంపదకు నిలయం. ఇక్కడున్న నంది ప్రపంచంలోనే అతి పెద్ద ఏక శిలా నందిగా పేరుగాంచింది. ఒకే రాయిని తొలిచి దీనిని నిర్మించారు. ఈ నంది విగ్రహం 15 అడుగుల ఎత్తు, 27 అడగులు పొడవు ఉంటుందని ఆలయ సిబ్బంది చెబుతున్నారు. దేశ, విదేశాల నుంచి ఎంతో మంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు.