మెట్ట చిట్టాపూర్‌లో ఉచిత డయాబెటిస్ పరీక్షలు
JGL: మెట్‌పల్లి మండలంలోని మెట్లచిట్టాపూర్ గ్రామంలో శనివారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత డయాబెటీస్ (మధుమేహం) పరీక్షలను నిర్వహించారు. గ్రామంలో 50 మందికి పైగా ఈ సేవలను వినియోగించుకున్నారు. ఆరోగ్యం విషయంలో ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు వేలముల శ్రీనివాస్, అల్ రౌండర్ గంగాధర్ పాల్గొన్నారు.