VIDEO: ఘనంగా ఆంజనేయ స్వామి శోభయాత్ర
SRCL: చందుర్తి మండలం మల్యాల గ్రామంలో హనుమాన్ జయంతి వేడుకలు మిన్నంటాయి. గురువారం సాయంత్రం ఆంజనేయ స్వామి ఆలయం నుండి ప్రారంభమైన శోభాయాత్ర భక్తుల జయజయధ్వానాల మధ్య ఘనంగా సాగింది. 'జై శ్రీరామ్' నినాదాలతో గ్రామం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. పెద్ద ఎత్తున తరలివచ్చిన భక్తులు శోభాయాత్రలో పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.