నేడు జిల్లాలో భారీగా వర్షాలు కురిసే అవకాశం
సంగారెడ్డి జిల్లాలో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. జిల్లాలో వడగాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ జిల్లాకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వడగాలులు 41-61 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని తెలిపింది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేసింది.