'మార్కెట్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తాం'

'మార్కెట్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తాం'

MHBD: వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును పాలకుర్తి శాసన సభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. పాలకుర్తి నియోజకవర్గంలోని మూడు మార్కెట్ కమిటీల అభివృద్ధిపై వినితిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే విజ్ఞప్తికి స్పందించిన మంత్రి రైతుల సమస్యలను పరిష్కరించేందుకు, చర్యలు తీసుకుని మార్కెట్ల అభివృద్ధికి నిధులను మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.