మెడికల్ షాప్ యజమానులతో సీఐ సమావేశం

మెడికల్ షాప్ యజమానులతో సీఐ సమావేశం

అన్నమయ్య: రాయచోటి అర్బన్ CI బి. వెంకటా చలపతి పట్టణంలోని కెమిస్ట్, మందుల షాపు యజమానులతో సమావేశం నిర్వహించారు. సీఐ మాట్లాడుతూ.. పట్టణంలోని యువత ట్యాబ్లెట్ల రూపంలో మత్తుకు బానిసలవుతున్నారని, దీనిని దృష్టిలో పెట్టుకొని ఏ మెడికల్ షాప్ యజమాని అయినా.. ప్రిస్క్రిప్షన్ లేనిదే నిషేధిత మందులను అమ్మరాదని సూచించారు. ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.