బ్రతికే అర్హత లేదంటూ.. యువకుడు సూసైడ్
విశాఖ: పరీక్షల్లో ఫెయిలవడంతో ఓ యువకుడు ప్రమాదకరమైన హీలియం గ్యాస్ పీల్చి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆరిలోవ ప్రాంతంలో నివాసముంటున్న అఖిల్ వెంకట కృష్ణ.. ఇటీవల వెలువడిన CA పరీక్షల్లో ఫెయిలయ్యాడు. దీంతో మనస్తాపం చెంది.. 'తల్లిదండ్రులను మోసం చేశానని, ఇక నాకు జీవించే అర్హత లేదంటూ.. భావోద్వేగ లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లేఖ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.