VIDEO: మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే
WNP: కొత్తకోట మండలం అప్పరాలకు చెందిన బొగ్గుల అబ్దుల్లా ఆదివారం రాత్రి బైక్‌పై గ్రామానికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో అటుగా వెళుతున్న దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గమనించి గాయపడిన వ్యక్తిని తన వాహనంలో చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు. మెరుగైన వైద్యం అందించాల్సిందిగా ఆయన తెలిపారు.