కోట మైసమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే

SRPT: సూర్యాపేటలోని కూరగాయల మార్కెట్లో కొలువుదీరిన శ్రీ కోట మైసమ్మ తల్లి దేవాలయంలో గురువారం సంప్రదాయ పద్ధతిలో అన్ని రకాల పండ్లు, ఫలహారాలతో అమ్మవారికి నైవేద్యం కుంభం పోయుట ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుకున్నారు.