'పేదోళ్లకు న్యాయం చేస్తూనే అభివృద్ధి చేస్తాం'

NLG: పేదోళ్లకు అన్యాయం చేసి అభివృద్ధి చేయమని, పేదోళ్లకు న్యాయం చేస్తూనే అభివృద్ధి చేస్తామని మునుగోడు MLA రాజగోపాల్ రెడ్డి అన్నారు. బుధవారం కనగల్ నుంచి మాల్ R&B రోడ్డు విస్తరణలో భాగంగా చండూరు మండలం బంగారిగడ్డ గ్రామంలో రోడ్డు విస్తరణలో కోల్పోతున్న ఇండ్లను పరిశీలించి మాట్లాడారు. ఇండ్లు కోల్పోతున్న నిరుపేదలకు ఏదోరకంగా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.