రేపల్లెలో రేపు విద్యుత్ కోత
BPT: కొత్త 33కేవీ లైన్ పనుల కారణంగా రేపల్లె పరిసరాల్లో గురువారం విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కరెంట్ ఉండదు. ఇసుకుపల్లి, నిజాంపట్నం రోడ్డు, మసీదు సెంటర్ నుంచి బస్టాండ్, బసవేశ్వర థియేటర్ రోడ్డు మార్గాల్లో సరఫరా నిలిపివేస్తారు. అలాగే బేతపూడి, ఉప్పుడి, ఉయ్యూరువారిపాలెం గ్రామాల్లో కరెంట్ కోత విధించనున్నారు.