రేపటి ఎంపీ పర్యటన వివరాలు

VZM: విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు బుధవారం ఉదయం 9 గంటల నుండి ఎచ్చెర్ల నియోజకవర్గంలో పలు రకాల కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. అనంతరం ఉదయం 11గంటల నుండి విజయనగరం జిల్లా కలెక్టరేట్ ఆడిటోరియంలో శ్రీ అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా పుష్పమాలాలంకరణ కార్యక్రమంలో పాల్గొనున్నారు. ఈ మేరకు ఎంపీ క్యాంప్ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపారు.