రసూల్ పురా జంక్షన్ వద్ద ఫ్లైఓవర్

HYD: గ్రేటర్ నగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడానికి రసూల్ పురా జంక్షన్ వద్ద రూ. 150 కోట్లతో ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. 4 లేన్లతో, వై ఆకారంలో నిర్మించే ఈ ఫ్లైఓవర్‌కు GHMC టెండర్లు ఆహ్వానించింది. భూసేకరణకే దాదాపు రూ. 70 కోట్లు ఖర్చు కానుంది. ఈ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.