నేడు నియోజకవర్గంలో మంత్రి పర్యటన

MHBD: డోర్నకల్ నియోజకవర్గ పరిధిలో ఆదివారం మంత్రుల పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రి సీతక్క, ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్, మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్‌లు పర్యటిస్తున్నట్లు అధికారులు తెలిపారు.