20 వేల గాజులతో అమ్మవారికి అలంకరణ

W.G: భీమవరం మెంటేవారి తోటలోని శ్రీబాల త్రిపుర సుందరి అమ్మవారికి 20 వేల గాజులతో అలంకరణ చేశారు. భాద్రపద మాసం శుక్రవారం సందర్భంగా ఆలయ కమిటి ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు కొమ్ము శ్రీనివాస్ అమ్మవారికి కుంకుమ పూజలను నిర్వహించారు. భక్తుల సహకారంతో సుమారు 20 వేల గాజులతో అమ్మవారికి అలంకరణ చేశారు. ఆదివారం భక్తులకు ఈ గాజులను పంపిణీ చేస్తామని తెలిపారు.