బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మంత్రి

MLG: దేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ జయంతి సందర్భాన్ని పురస్కరించుకుని, తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ–శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క చిన్నారులకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బాలలను దేశ భవిష్యత్‌గా భావించి వారికి మెరుగైన భవిష్యత్తును అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.